ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు పోలీస్ స్టేషన్లను సోమవారం జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసులపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించే విషయంలో ఎస్ఐలకు సీఐలకు ఎస్పీ దామోదర్ సూచనలు సలహాలు ఇచ్చారు. సాధారణ తనిఖీలలో భాగంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటించినట్లుగా ఎస్పీ దామోదర్ తెలిపారు.