ముత్రాసుపల్లిలో ఉద్రిక్తత

63చూసినవారు
కొమరోలు మండలం ముత్రాసు పల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనాన్ని నిలిపించిన విషయంలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. గొడవ పెద్దది కావడంతో రాళ్లు రువ్వుకున్నారు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన చెరుకుని గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్