కొమరోలులో కోళ్ల దొంగలు

52చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కోళ్ల దొంగలు రెచ్చిపోయారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వీర మోహన్ రెడ్డి అనే రైతుకు చెందిన పొలంలో ఓ మహిళతోపాటు ఇద్దరు వ్యక్తులు కోళ్లను దొంగిలించారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక రైతు వీరమోహన్ రెడ్డి శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. గత కొద్దిరోజులుగా కోళ్ల దొంగతనాలు మండలంలో జరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్