మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ట్రూ ఆఫ్ చార్జీలు కరెంటు బిల్లులపై వసూలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అసెంబ్లీలో బుధవారం అన్నారు. 2014 19 టిడిపి హయాంలో విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా సీఎం చంద్రబాబు చూశారని వైసిపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజలపై అధిక భారాన్ని వేసిందని అశోక్ రెడ్డి అన్నారు.