రాచర్లలో మార్కాపురం వైసీపీ ఇన్ ఛార్జ్

71చూసినవారు
రాచర్లలో మార్కాపురం వైసీపీ ఇన్ ఛార్జ్
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో మంగళవారం ప్రస్తుతం మార్కాపురం వైసీపీ ఇన్ ఛార్జ్ 2019 సంవత్సరంలో గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నా వెంకట రాంబాబు పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొని అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు అన్నా వెంకట రాంబాబు స్వీకరించారు. తర్వాత గ్రామస్తులు ఆయనను సన్మానించారు.

సంబంధిత పోస్ట్