బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన 15 మంది భక్తులు యర్రగొండపాలెం నల్లమల అటవీ ప్రాంతంలో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లి చిక్కుకున్నారు. బుధవారం శ్రీశైలం మల్లన్న దర్శించుకుని ఇష్టకామేశ్వరి ఆలయానికి నల్లమల అటవీ ప్రాంతంలో ఖాళీ నడకన బయలుదేరారు. దారి తప్పిపోవడంతో భక్తులు మొబైల్ సిగ్నల్ అందే ప్రాంతంలోకి వెళ్లి 100 ద్వారా అధికారులకు సమాచారం అందించారు. యర్రగొండపాలెం అటవీశాఖ, పోలీసులు భక్తులను రక్షించారు.