జాతీయ లోక్‌ అదాలత్‌ లో 52 కేసులు పరిష్కారం

81చూసినవారు
జాతీయ లోక్‌ అదాలత్‌ లో 52 కేసులు పరిష్కారం
కనిగిరి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 52 కేసులు పరిష్కారం అయినట్లు న్యాయమూర్తి కె. భరత్ చంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసులు 46, సివిల్‌ కేసులు2, భరణం కేసులు 4 ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు. కక్షలు, కార్పణ్యాలకు వెళ్లకుండా రాజీ మార్గంలో వెళ్లి రాజ మార్గాన్ని అనుసరించాలని జడ్జి కె. భరత్ చంద్ర సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్