కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా కాలనీ హాస్టల్ వెనకాల లైన్ గత 20 రోజుల నుండి కాలువ నిండా చెత్త చెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ, దోమలకు నిలయాలుగా మారాయని గురువారం అక్కడి ప్రజలు అంటున్నారు. దీనితో దోమల బెడద ఎక్కువై ప్రజలు అనారోగ్యానికి కారణం అవుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి కాలువలో వ్యర్థాలను తొలగించి, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.