పారిశుద్ధ్యం అలసత్వం వహిస్తే చర్యలు

59చూసినవారు
పారిశుద్ధ్యం అలసత్వం వహిస్తే చర్యలు
పారిశుద్ధ్యం పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ హెచ్చరించారు. శుక్రవారం కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద పెద్ద ఎత్తున చెత్త వ్యర్థాలు పేరుకుపోవడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన అక్కడికి చేరుకుని పారిశుద్ధ్య సిబ్బందిచే చెత్త, వ్యర్థాలను క్లీన్ చేయించారు. శానిటరీ సెక్రటరీలు బాధ్యతగా పనిచేయాలని, పారిశుద్ధ్యం పై ప్రజలనుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్