కనిగిరి శివనగర్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీలో ఐదవ తరగతి పూర్తి అవుతున్న విద్యార్థులను కనిగిరి మోడల్ స్కూల్ లో చేర్పించేందుకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేయించి పరీక్ష రాసేందుకు ప్రోత్సహించాలని ఎస్ఎంసి చైర్మన్ పందిటి మోహన్ తెలిపారు. కనిగిరిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులను గురువారం ఆయన కలిసి కనిగిరి మోడల్ స్కూల్ కరపత్రాలను అందించారు. విద్యార్థులను మోడల్ స్కూల్లో చేర్పించాలని కోరారు.