పామూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణి చేసిన కూటమి నేతలు

62చూసినవారు
పామూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణి చేసిన కూటమి నేతలు
పామూరు పట్టణంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఎంపీడీఓ సురేష్, ఖాదర్ బాషా, కూటమి నేతలు ఇంటింటి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే అని పేర్కొన్నారు. 2 నెలలు పెన్షన్ రాకపోతే 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వాలని, మరణించిన పెన్షన్ దారుని భార్యకు తర్వాత నెలలో పెన్షన్ ఇవ్వాలని కూడా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్