చంద్రశేఖరపురం మండల సర్వసభ్య సమావేశం ఈనెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సీహెచ్. రామచంద్రరావు బుధవారం ఓప్రకటనలో తెలిపారు. సమావేశంలో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించి, సమస్యలపై చర్చించడం జరుగుతుందని చెప్పారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.