హనుమంతుని పాడు మండలంలోని చిన్న గొల్లపల్లి గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్ల జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఎస్సై మాధవరావు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. తిరునాళ్ల కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు.