కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి సందర్శించారు. డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి, రోగాలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ తరహాలో పేదలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.