భైరవకోనలో భక్తుల సందడి

82చూసినవారు
భైరవకోనలో భక్తుల సందడి
చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో భక్తులు సందడి చేశారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున భైరవకోనక చేరుకొని సుందరమైన జలపాతం లో స్నానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముఖ దుర్గాంబా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సిద్దు రమణారెడ్డి భక్తులకు వసతులు సమకూర్చారు.

సంబంధిత పోస్ట్