బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దు

62చూసినవారు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దు
హనుమంతునిపాడు మండల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శివ బసవరాజు మంగళవారం హెచ్చరించారు. వైన్ షాపుల సమీపంలో రోడ్లపైన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారన్నారు. ఆయా ప్రదేశాలపై నిఘా ఉంచామని, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నట్లయితే సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్