మంగంపల్లిలో పర్యటించిన డీఎస్పీ

76చూసినవారు
మంగంపల్లిలో పర్యటించిన డీఎస్పీ
హనుమంతునిపాడు మండలంలోని మంగంపల్లి గ్రామంలోని మంగమ్మ సమేత గరిటయ్య స్వామి తిరుణాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలను డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సోమవారం తిలకించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను డీఎస్పీ అభినందించి, విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. తిరుణాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టినట్లు వివరించారు. సీఐ ఖాజావలి, ఎస్సై మాధవరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్