జగన్ ను కలిసిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే

79చూసినవారు
జగన్ ను కలిసిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే
వైసిపి అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాజకీయ అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని జగన్ సూచించినట్లుగా మధుసూదన్ యాదవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్