మాజీ రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్. తులసి రెడ్డి సోమవారం కనిగిరి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు దేవరపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.