పెదచెర్లోపల్లి మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనికి తోడు వడగళ్ల వర్షం కురిసింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి గాలివాన బీభత్సంతో కూడిన వర్షాన్ని చూడలేదని స్థానికులు అంటున్నారు. ఈ అకాల వర్షానికి మండలంలో పంటలు ఎంత మేర నష్టం వాటిల్లుతుందోనని రైతాంగం ఆవేదన చెందుతుంది.