హెల్మెట్ ధారణపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో సోమవారం కనిగిరిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో వాహన దారులకు అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డిఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఖాజావలి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.