కనిగిరి పట్టణంలో రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ ఇన్విటేషన్ టోర్నమెంట్ ను కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర, డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. మాజీ జెడ్పిటిసి పులి వెంకట రమణారెడ్డి జ్ఞాపకార్ధంగా ఈ పోటీలను నిర్వహిస్తుండగా ముఖ్యఅతిథిగా జడ్జి, డిఎస్పీ పాల్గొని పోటీలను ప్రారంభించారు. రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.