పామూరులో జెవివి జిల్లా స్థాయి శిక్షణా తరగతులు

62చూసినవారు
పామూరులో జెవివి జిల్లా స్థాయి శిక్షణా తరగతులు
ఏప్రిల్ 13వ తేదీ పామూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జెవివి జిల్లాస్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస రెడ్డి శనివారం ఓ ప్రకటన తెలిపారు. ఈ క్లాసులకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం గేయానంద్ హాజరవుతారన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆల్ఫా హై స్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్