కనిగిరి:ఈదురు గాలులకు నేలకొరిగిన భారీ వృక్షం

72చూసినవారు
కనిగిరి:ఈదురు గాలులకు నేలకొరిగిన భారీ వృక్షం
కనిగిరిలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. కనిగిరి- హనుమంతునిపాడు రహదారిలో ఓ వృక్షం కూలిపోయి ఆర్ అండ్ బి రహదారిపై పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధికారులు స్పందించి కూలిన వృక్షాన్ని రోడ్డుపై నుండి తొలగించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్