వెలిగండ్ల మండలంలో గ్రామ సచివాలయాల పరిధిలో ఆధార్ క్యాంపులు ఈనెల 11 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సుభాని బుధవారం తెలిపారు. కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి బయోమెట్రిక్ అప్‌డేట్, ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డులు జారీ వంటి సేవలను ఈ క్యాంపుల్లో అందించనున్నారు.