అరుదుగా కనిపించే నక్షత్ర తాబేళ్లను వేటాడటం నేరమని కనిగిరి అటవీశాఖ అధికారి ఉమామహేశ్వర రెడ్డి తెలిపారు. సోమవారం అటవీశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో వీటిపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎవరైనా విదేశాలకు నక్షత్ర తాబేళ్లు తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.