కనిగిరి పట్టణంలో నిబంధనలు పాటించకుండా అనధికారికంగా లేఔట్ లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి ఆర్టీవో కేశవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. కనిగిరిలోని ఆర్డీవో కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఆర్డిఓ గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనధికారికంగా వేసిన లేఔట్లను గుర్తించాలన్నారు. వారికి నోటీసులు ఇచ్చి నిబంధనల మేరకు అనుమతులు పొందేలా చూడాలని ఆదేశించారు.