కనిగిరి: హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించండి

61చూసినవారు
కనిగిరి: హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించండి
కనిగిరి మండలంలోని బల్లిపల్లి గ్రామంలో గురువారం తహసిల్దార్ అశోక్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఉస్తుం వారి పల్లి గ్రామస్తులు తమ గ్రామానికి హిందూ స్మశాన వాటిక కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని తహసిల్దార్ అశోక్ రెడ్డికి వినతిపత్రం అందించారు. స్మశాన వాటికకు తగినంత స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు విన్నవించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్