కనిగిరి మండలంలోని ఏరువారి పల్లిలో అంకాలమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా మంగళవారం అమ్మవారి చిన్న ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంలో అంకాలమ్మ తల్లిని ఊరేగించారు. భక్తులు అమ్మవారికి ఎదురేగి , హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రసాదాలు పంపిణీ చేశారు.