వెలిగండ్ల మండలంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ మహబూబ్ బాషా బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 21 సంవత్సరం నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న ఎస్సీ అభ్యర్థులు రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏప్రిల్ 14వ తేదీ నుండి మే నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు.