కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ లో ఉచిత మేగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ఏర్పాటు చేశారు. క్యాన్సర్ జబ్బులతో బాధపడుతున్న రోగులకు ఓ ఆసుపత్రి తరుపున వచ్చిన వైద్య బృందం క్యాన్సర్ వైద్య పరీక్షలను నిర్వహించారు. క్యాన్సర్ రోగులతో పాటు క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకునేందుకు స్క్రీనింగ్ టెస్టులు కూడా వైద్య శిబిరంలో నిర్వహించారు.