నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి విమర్శించారు. కనిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసిన సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు గడిచిన ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు.