హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ను కనిగిరి సీఐ ఖాజావలి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని పలు రికార్డులను సీఐ పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్సై మాధవరావుకు సూచించారు. మండలంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని, నేరాల అదుపుకు కృషి చేయాలని సీఐ ఆదేశించారు.