ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పునుగోడు గ్రామంలో గర్భవతులకు నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం పాల్గొన్నారు. గర్భవతులకు సీమంతాల కిట్లను కలెక్టర్ శనివారం పంపిణీ చేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.