కనిగిరి: ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని ధర్నా

78చూసినవారు
కనిగిరి: ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని ధర్నా
హనుమంతునిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ భూములను, పేదలకు పంచాలని మిట్టపాలెం గ్రామానికి చెందిన పేదలు శుక్రవారం ధర్నా చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో  వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదలకు సెంటు భూమి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బినామీ పేర్లతో పెత్తందారులు భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు, సాగు భూములను పంపిణీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్