కనిగిరి: అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు

75చూసినవారు
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సచివాలయంలో శుక్రవారం రెవెన్యూ సదస్సును తహసిల్దార్ చింతలపూడి అశోక్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్లకు రెవెన్యూ అనుమతి ఇవ్వరని తెలిపారు. మున్సిపాలిటీ, పంచాయతీ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డిటిసి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోవద్దని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్