సిఎస్ పురం మండలంలోని రెడ్డి గారి కొత్తపల్లి ఎస్సీ కాలనీలోని పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేయటానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కనిగిరి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ ఇన్ ఛార్జ్ జెపి రాజు మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ దాస్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఎంఈఓకు తెలిపినట్టు జివి రాజు మాదిగ పేర్కొన్నారు.