క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని కనిగిరి సీఐ ఖాజావలి సూచించారు. కనిగిరి మండలం పరిధిలోని అజీస్ పురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కనిగిరి పరిసర ప్రాంతంలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులు, పందెపు రాయుళ్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచామన్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన, నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.