కనిగిరిలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం డిఎస్పి యశ్వంత్ డివిజన్ లోని పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులు, నేరాల సంఖ్య, కేసుల దర్యాప్తు స్థితి తీసుకునే చర్యల పై దిశా నిర్దేశం చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డిఎస్పి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.