కనిగిరి డివిజన్ పరిధిలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపడితే చర్యలు తీసుకుంటామని కనిగిరి డిఎస్పి మహేశ్వర రావు హెచ్చరించారు. డిఎస్పీ కార్యాలయంలో గురువారం అయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.