కనిగిరి: పెండింగ్ బిల్లుల కోసం ఉపాధి కూలీల ఆందోళన

80చూసినవారు
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కూలీలతో పనిచేయుచుకుంటూ బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లును చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్