కనిగిరి పట్టణంలోని పెద్ద చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి చెరువును అభివృద్ధి చేయాలని టిడిపి పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ అశోక్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. కనిగిరిలోని తహసిల్దార్ కార్యాలయంలో టిడిపి నాయకులు మాట్లాడుతూ చెరువు ఆక్రమణలకు గురికావడం వల్ల వచ్చే వర్షపు నీరు చెరువులోకి చేరటం లేదన్నారు. ఆక్రమణలు తొలగించి హద్దురాళ్ళు ఏర్పాటు చేయాలని వారు సూచించారు.