పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురు పట్టి పరిసరాలను మున్సిపల్ చైర్మన్ శుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛత అనేది కేవలం పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే బాధ్యత కాదని, అందరి బాధ్యత అన్నారు.