పెదచెర్లోపల్లి మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ సహాయకులు మనోహర్ కు వినతి పత్రం అందించారు. వడగళ్ల వర్షానికి మిర్చి, పొగాకు, కంది పంట తడిసిపోయి దెబ్బతిన్నాయన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కోరారు.