11 వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భముగా మంగళవారం యోగాంధ్రలో భాగంగా ఒంగోలులోని మిని స్టేడియం లో జరిగిన జిల్లా స్థాయి యోగ పోటీలను ప్రభుత్వ అధికారులు నిర్వహించారు. ఈ పోటీలలో పెద్ద చెర్లోపల్లి కి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు స్వర్ణ రమణయ్య ఆసనాలు, సూర్యనమస్కారాలులో 35 సంవత్సారాలు పైన విభాగములో ప్రథమ స్థానం సాధించాడు. ఈయన విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది.