చంద్రశేఖరపురంలోని కదిరి వెంకట నరసయ్య, లక్ష్మమ్మ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో శనివారం రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. హైస్కూల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో సీనియర్ ఇంటర్ బైపీసీలో గోగు మహాలక్ష్మి 1000/971 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. బైపీసీలో 1000/962 మార్కులు సాధించిన రేవతి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మున్సిపల్ తిరుపతయ్య, ఎస్ఎంసి చైర్మన్ మస్తానయ్య, చలపతిరావు అభినందించారు.