కట్టుకున్న భార్యను ఓ భర్త హతమార్చాడు. ఆ నిందితున్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పామూరులోని ప్రశాంతి నగర్ వద్ద ఈ నెల 13వ తేదీన జరిగిన భార్య హత్య కేసులో నిందితుడు రమేష్ ను పామూరు మండలం కొత్తపల్లి గ్రామం జంక్షన్ వద్ద పామూరు పోలీసులు పట్టుకున్నట్లుగా డి. ఎస్. పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. డి. ఎస్. పి కార్యాలయంలో మీడియా సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టారు.