నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బస్ పాస్ లు ఇవ్వడానికి క్రొత్తగా సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేస్తున్నందున కనిగిరి బస్టాండ్ లో 12,13 తేదీలలో బస్ పాస్ లు ఇవ్వబడవని డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. మరల 14వ తేది నుండి బస్ పాస్ లు ఇవ్వబడునని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు, విద్యా సంస్థలు గమనించుకొని శనివారం నుండి రావాలని డిపో మేనేజర్ సయానా బేగం కోరారు.