పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి పట్టణంలో మహిళలు గ్యాస్ సిలిండర్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. సుగుణవతమ్మ హాస్పిటల్స్ సెంటర్లో నిరసన తెలిపారు. ఐద్వా కనిగిరి పట్టణ కార్యదర్శి ప్రసన్న మాట్లాడుతూ గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర ధరలు పెరగడం వల్ల సామాన్యుడి జీవనం ఇబ్బందికరంగా మారిందని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.