కనిగిరి మున్సిపాలిటీలోని 11వవార్డు కాశిరెడ్డి నగర్ కాలనీ యానాదులు నివాస ప్రాంతాల్లో చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ శుక్రవారం పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ స్తంభాలు, కొత్త విద్యుత్ దీపాలు, మంచినీటి సౌకర్యం, పూర్తిస్థాయిలో అందిస్తున్నామని తెలిపారు.